Shyam Singha Roy: ‘శ్యామ్‌ సింగరాయ్‌’ జ్ఞాపకాలు.. వాసు మదిలో మెదిలిన వేళ..

నాని ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’.

Updated : 25 Jan 2022 12:12 IST

హైదరాబాద్‌: నాని ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో హిట్ టాక్‌ అందుకున్న ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించడానికి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌ సిద్ధమైంది. నిడివి, ఇతర కారణాల వల్ల సినిమా నుంచి తొలగించిన పలు సన్నివేశాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తాజాగా ‘వాసు రీకలెక్షన్‌ శ్యామ్‌’ పేరుతో విడుదల చేసిన వీడియో భావోద్వేగంతో సాగింది. వాసుగా తిరిగి జన్మించిన శ్యామ్‌ సింగరాయ్‌ కోల్‌కతా వెళ్లి అక్కడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న వీడియో ఆద్యంతం అలరిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని