Vasuki: స్టార్ హీరో సినిమా.. ఆ కారణంతోనే వదులుకున్నా: వాసుకి
సంతోశ్ శోభన్, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి వాసుకి (Vasuki).
హైదరాబాద్: సుమారు పాతికేళ్ల విరామం తర్వాత వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి వాసుకి (Vasuki). పవన్ కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ‘అన్నీ మంచి శకునములే’తో కెమెరా ముందుకు వచ్చారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వాసుకి.. పవన్‌కల్యాణ్, కమల్‌హాసన్ గురించి మాట్లాడారు.
‘‘నేను ఎక్కువగా తమిళ సినిమాలు చూస్తుంటాను. కమల్‌హాసన్ అంటే నాకెంతో అభిమానం. గతంలో ఆయన నటించిన ‘మహానది’లో ఓ పాత్ర కోసం నన్ను అడిగారు. అయితే, కొన్ని విషయాలు ఆమోదయోగ్యంగా అనిపించలేదు. అందుకే ఆ ఆఫర్‌ను వదులుకున్నా. ఇక, పవన్‌కల్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన నా భర్తకు మంచి మిత్రుడు. ‘తొలిప్రేమ’ తర్వాత పవన్‌కల్యాణ్‌ను మేం చాలాసార్లు కలిశాం. ఆయనకు నైతిక విలువలు ఎక్కువ. ఏ విషయంలోనూ రాజీపడరు. అప్పటికీ ఇప్పటికీ ఆయన ఒకేలా ఉన్నారు. ఏమీ మారలేదు’’ అని వాసుకి తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
-
Crime News
Murder Case: హయత్‌నగర్‌లో వృద్ధురాలి హత్య.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Sports News
Kohli: ఆ రెండు సిరీస్‌ల్లో విజయాల తర్వాత ఆసీస్ మమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు: విరాట్ కోహ్లీ
-
India News
Bengaluru: సీఎం గారూ.. ‘ప్రశాంత కర్ణాటక’ కోసం హెల్ప్‌లైన్ పెట్టండి: మంత్రి విజ్ఞప్తి
-
Movies News
రజనీకాంత్‌కు ‘సన్నాఫ్ ఇండియా’ కథ చెప్పా.. అలా చేసి ఉంటే హిట్ అయ్యేది: డైమండ్ రత్నబాబు
-
General News
Tractor Accident: ప్రత్తిపాడులో విషాద ఛాయలు