VD11: విజయ్‌-సామ్‌ల ‘ఖుషి’ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, అగ్ర కథానాయిక సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల ప్రారంభమైన .....

Published : 16 May 2022 09:49 IST

హైదరాబాద్‌: సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, అగ్ర కథానాయిక సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. తాజాగా సినిమా నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ని సోమవారం ఉదయం చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సైతం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ ఫుల్‌ స్టైలిష్‌ లుక్‌లో.. సామ్‌ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పోస్టర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ ఏడాది డిసెంబర్‌ 23న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని