Veera Simha Reddy: బరిలోకి దిగేది ఆరోజే

సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలు ఏవనేది చాలా రోజుల కిందటే తేలిపోయింది. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలతోపాటు... తమిళ కథానాయకుడు  విజయ్‌ నటించిన ‘వారసుడు’ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

Updated : 04 Dec 2022 07:22 IST

సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలు ఏవనేది చాలా రోజుల కిందటే తేలిపోయింది. అగ్ర కథానాయకులు బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి చిత్రాలతోపాటు... తమిళ కథానాయకుడు  విజయ్‌ నటించిన ‘వారసుడు’ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక వాటి విడుదల తేదీల్ని ఖరారు చేసి ప్రకటించడంపై దృష్టిపెట్టాయి ఆయా సినీ బృందాలు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాన్ని  జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు శనివారం అధికారికంగా ప్రకటించాయి ఆ చిత్ర వర్గాలు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  బాలకృష్ణకి జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముఖ్యపాత్ర పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు