Balakrishna: వీరసింహారెడ్డిలో 11 ఫైట్స్...!
అఖండ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా వీరసింహారెడ్డి. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
హైదరాబాద్: బాలకృష్ణ(Balakrishna) సినిమా వస్తుందంటేనే చాలు బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. గతేడాది రిలీజ్ అయిన ‘అఖండ’(Akhanda) సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలించింది. ఆ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా వీరసింహారెడ్డి(Veera Simha Reddy). ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే, ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అవ్వనున్నాయట. బాలకృష్ణ సినిమాలు అంటేనే యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్స్ ఉండనున్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఫైట్స్ ఉన్న సినిమాగా వీరసింహారెడ్డి నిలిచిపోతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ న్యూస్ మాత్రం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గోపించంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తయింది. ప్రస్తుతం అనంతపురంలో చిత్రీకరణ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్ అలరించనుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అభిమాలనులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Overseas Education: భారతీయ విద్యార్థుల గమ్యస్థానాలు అమెరికా, కెనడా, బ్రిటన్
-
World News
Video games: వీడియో గేమ్స్‌తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు
-
Crime News
Andhra News: అనాథ దళిత యువతిపై వాలంటీరు అత్యాచారం
-
Ts-top-news News
TS EAMCET: ఇంటర్ ఫస్టియర్‌లో 70% సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు
-
India News
Surrogacy: ‘సరోగసీ అమ్మకు.. జన్మించే బిడ్డతో జన్యుపరమైన బంధం ఉండదు’