Venky75: ‘సైంధవ్’గా రానున్న వెంకటేష్..
శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ‘‘సైంధవ్’’(Saindhav) అనే పేరును ఖరారు చేశారు.
హైదరాబాద్: ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లతో అలరించిన వెంకటేష్(Venkatesh) ఇప్పుడు యాక్షన్ మూవీతో పలకరించడానికి సిద్ధమయ్యాడు. ‘హిట్’(HIT) లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ 75వ(#Venky75)వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు ‘‘సైంధవ్’’(Saindhav) అనే పేరును ఖరారు చేశారు. రెండు నిమిషాలు ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో వెంకటేష్(Venkatesh Daggubati) గన్ పట్టుకుని కనిపిస్తూ ‘నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..’’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీభాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ’ సినిమాతో క్లాసిక్ హిట్‌ను అందుకున్న నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంతోష్ సంగీతం అందిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ఆ హీరోతో ఫొటో దిగినందుకు ఖుష్బూ సుందర్ ఆనందం.. పులివెందులలో అషు!
-
India News
IndiGo: అత్యవసర ద్వారం కవర్ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు
-
Movies News
Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్
-
India News
Narendra Modi : ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ