Venky75: యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమైన వెంకటేష్.. ‘హిట్’ కాంబో ఫిక్స్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేష్(Venkatesh) తాజా చిత్రాన్ని(#Venky75) ప్రకటించారు. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో నటించనున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతగానో దగ్గరయ్యారు హీరో వెంకటేష్(Venkatesh). గతేడాది ‘‘ఎఫ్3’’, ఓరి దేవుడా సినిమాల్లో కనిపించి అలరించారు. ఈ అగ్ర కథానాయకుడి తర్వాత చిత్రం గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేష్ 75వ(#Venky75) చిత్రానికి ముహుర్తం ఖరారైంది. ‘హిట్’(HIT) సిరీస్ చిత్రాలతో విజయాల్ని అందుకున్న శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేష్ నటించనున్నారు. ఇక ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ’ సినిమాతో క్లాసిక్ హిట్‌ను అందుకున్న నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ను షేర్ చేసిన వెంకటేష్(Venkatesh Daggubati) ‘‘సరికొత్త సాహసానికి సమయం వచ్చింది’’ అని పేర్కొన్నారు.
జనవరి 25న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరగనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరన్న విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. శైలేష్ కొలను, వెంకటేష్‌ల కాంబో ఎలా ఉండనుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: సిరీస్ ఖాతాలో పడాలంటే.. టాప్ ఆర్డర్ గాడిలో పడాల్సిందే!
-
General News
Andhra news: రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది: బండి శ్రీనివాస్
-
General News
TSWRES: తెలంగాణ గురుకుల సైనిక స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
-
Movies News
srirama chandra: సింగర్ అసహనం.. ఫ్లైట్ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!
-
India News
Temjen Imna Along: ‘నా పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది’.. పెళ్లి గురించి మంత్రి ఆసక్తికర ట్వీట్
-
General News
TSPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు