Venkatesh: దసరాకి షురూ?
‘ఎఫ్3’తో నవ్వించిన వెంకటేష్...తన కొత్త సినిమాని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కొంతకాలంగా కథల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన, ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి హిందీ చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాలి’ చేస్తున్నారు.
‘ఎఫ్3’తో నవ్వించిన వెంకటేష్ (Venkatesh)...తన కొత్త సినిమాని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కొంతకాలంగా కథల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన, ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి హిందీ చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాలి’ చేస్తున్నారు. మరి సోలోగా వెంకీ చేయనున్న కొత్త చిత్రం ఏమిటనేది మాత్రం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కొంతకాలం కిందట ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్‌కీ, వెంకటేష్‌కీ మధ్య కథా చర్చలు నడిచాయి. ఈ కలయికలోనే సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారం సాగినా... అనుదీప్ మరో చిత్రం ‘ప్రిన్స్’ కోసం రంగంలోకి దిగారు. అయితే వెంకీ - అనుదీప్ కలయికలో సినిమా మాత్రం దాదాపు ఖరారైనట్టు తెలిసింది. దసరాకి ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయనేది పరిశ్రమ వర్గాల మాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!