Venkatesh: తుది మెరుగుల్లో కథ

ఈ ఏడాది సంక్రాంతికి ‘సైంధవ్‌’తో సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు వెంకటేశ్‌. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించినా.. ఇంత వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు.

Published : 19 Jun 2024 01:43 IST

ఏడాది సంక్రాంతికి ‘సైంధవ్‌’తో సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు వెంకటేశ్‌. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించినా.. ఇంత వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. అనిల్‌ రావిపూడి ఇప్పుడు ఈ కథకు సంబంధించిన డైలాగ్‌ వెర్షన్‌ను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. మరోవైపు చిత్ర బృందం కథానాయికతో పాటు మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇందులో వెంకీకి భార్యగా కనిపించనుందని సమాచారం. ఇక ప్రేయసి పాత్ర కోసం ఓ సీనియర్‌ నాయికను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌ ‘రానా నాయుడు 2’ వెబ్‌సిరీస్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు నుంచి దీని రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. విభిన్నమైన క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని