Venkatesh: వెంకటేష్‌... ‘సైంధవ్‌’

వెంకటేష్‌ 75వ చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 26 Jan 2023 13:54 IST

వెంకటేష్‌ (Venkatesh) 75వ చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. శైలేష్‌ కొలను (Sailesh Kolanu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సైంధవ్‌’ (SAINDHAV) అనే టైటిల్‌ ఖరారు చేశారు. బుధవారం ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌తో పాటు తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు.  ఆ వీడియోలో వెంకీ ఓ మెడిసిన్‌ వయాల్‌ ఉన్న బాక్స్‌తో చంద్రప్రస్థ అనే ఓడ రేవు ప్రాంతంలోకి వెళ్లడం.. అక్కడి కంటైనర్‌ నుంచి ఓ తుపాకీ తీసుకొని బయటకు రావడం.. చివర్లో అక్కడే ఉన్న రౌడీ గ్యాంగ్‌కు ‘‘నేనిక్కడే ఉంటారా. ఎక్కడికీ వెళ్లను. రమ్మను’’ అంటూ వార్నింగ్‌ ఇవ్వడం ఆసక్తిరేకెత్తించింది. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి ఇదొక వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రమిది. దీన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, కూర్పు: గ్యారీ బిహెచ్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.మణికందన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని