Nuvvu Naaku Nachav: ‘నువ్వు నాకు నచ్చావ్‌’కు 20 ఏళ్లు.. ట్రైలర్‌ చూశారా?

Nuvvu Naaku Nachav: ‘నువ్వు నాకు నచ్చావ్’ 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటేశ్‌ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు.

Updated : 15 Aug 2022 15:37 IST

హైదరాబాద్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా కె.విజయ్ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘నువ్వు నాకు నచ్చావ్’. దివంగత నటి ఆర్తి అగర్వాల్‌ కథానాయిక నటించారు. సెప్టెంబరు 6, 2001న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. వెంకటేశ్‌ కామెడీ టైమింగ్‌, ఆర్తి అగర్వాల్‌ అందాలు, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌కు త్రివిక్రమ్‌ మెరుపులు తోడవడటంతో సినిమా ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌గా నిలిచింది. కోటి సంగీతం శ్రోతలను విశేషంగా అలరించింది. ఇక బ్రహ్మానందం, సునీల్‌, ఎం.ఎస్.నారాయణ కామెడీని ఎప్పటికీ మర్చిపోలేము. సోమవారంతో 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కథానాయకుడు వెంకటేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందంతో పాటు, విశేషంగా ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, ఇప్పుడు ఈ సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో చూపించేలా ట్రైలర్ విడుదల చేశారు ఆద్యంత అలరించేలా సాగిన ఆ ట్రైలర్‌ మీరూ చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని