Rana Naidu: అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి: వెంకటేశ్‌

వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో తొలిసారి కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ముంబయిలో నిర్వహించగా ఈ ఇద్దరు హీరోలు పాల్గొని సందడి చేశారు.

Updated : 15 Feb 2023 22:58 IST

ముంబయి: ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్‌ సిరీస్‌లో తాను పోషించిన నాగ పాత్రలో మంచీ చెడూ రెండు షేడ్స్‌ ఉంటాయని ప్రముఖ హీరో వెంకటేశ్‌ (Venkatesh) తెలిపారు. ముంబయిలో నిర్వహించిన ఆ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ఆయన హాజరై మాట్లాడారు. వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన సిరీస్‌ ఇది. మార్చి 10న ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో విలేకరులు అడిగిన ప్రశ్నలు దగ్గుబాటి హీరోలు సమాధానమిచ్చారు.

* మీ బాబాయ్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

రానా: మేం కలిసి నటించేందుకు ఇదే బెటర్‌ ప్రాజెక్టు అని భావించాం. బాబాయ్‌ చాలా కూల్‌గా ఉంటారు. ఆయనతో తెరను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థకు థాంక్స్‌.

* మీ పాత్ర, రానాతో కలిసి నటించడం గురించి చెప్పండి?

వెంకటేశ్‌: ఇందులో నేను నాగ అనే పాత్ర పోషించా. ఆ రోల్‌ నాకు చాలా ప్రత్యేకం. ఎమోషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌ అది. అందులో మంచీ చెడూ రెండూ ఉంటాయి. రానా విషయానికొస్తే.. ఇందులో అద్భుతంగా నటించాడు. ఇది రెగ్యులర్‌ కథలకు భిన్నంగా ఉంటుంది. అతనితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అద్భుతమైన సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌, దర్శకులకు ధన్యవాదాలు.

* మీకు కష్టమనిపించిన సన్నివేశం?

రానా: నేనెంతగానో ప్రేమించే మా బాబాయ్‌తో ఈ సిరీస్‌లో తలపడడం కష్టంగా అనిపించింది. ఇంకోటి దురుసుగా మాట్లాడడం.

* హిందీలో సంభాషణలు చెప్పడం మీకు కష్టమనిపించిందా?

వెంకటేశ్‌: అవును. కష్టంగానే అనిపించింది. కానీ, దర్శకుల సహకారంతో ముందుకెళ్లా. ఔట్‌పుట్‌ బాగానే వచ్చింది.

* ట్రైలర్‌ రిలీజ్‌తో మీ పాత్ర పేరు తెలిసింది. ఇప్పుడు ‘నాగ నాయుడు’ అని టైటిల్‌ మారుస్తారా?

వెంకటేశ్‌: నాకూ అదే అనిపిస్తుంది. ‘నాగ నాయుడు’ బెటర్‌ అని. కానీ, రానా నాయుడే కరెక్ట్‌ టైటిల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు