Venky Kudumula: అందుకే ఆ జోడిని మరోసారి రిపీట్ చేస్తున్నా: వెంకీ కుడుముల
‘ఛలో’ డైరెక్టర్ వెంకీ కుడుముల తన మూడో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్: తొలి సినిమా ‘ఛలో’ తో మంచి క్లాసిక్ హిట్‌ను అందుకున్నారు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). తర్వాత ‘భీష్మ’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే కాంబినేషన్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నితిన్ (Nithiin), రష్మిక (Rashmika)తో కలిసి మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే మెగాస్టార్‌తో తను తీయనున్న సినిమా విశేషాలు కూడా చెప్పారు.
‘‘నేను సినిమా తీయాలని అనుకోగానే నాకు మొదట ‘భీష్మ’ జోడినే గుర్తుకు వచ్చింది. నితిన్-రష్మికల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకే మరోసారి రిపీట్ చేస్తున్నా. నా తొలి చిత్రం ‘ఛలో’ షూటింగ్ సమయంలో నేను, రష్మిక మంచి స్నేహితులమయ్యాం. ‘భీష్మ’ సమయంలో నితిన్ కూడా మాతో బాగా కలిసిపోయాడు. ఈ చిత్రం గతంలో నేను తీసిన రెండు సినిమాల కంటే పెద్ద హిట్ అవుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న కమర్షియల్ సినిమా ఇది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు’’ అని చెప్పారు.
ఇక మెగాస్టార్‌తో తన సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నేను చిరంజీవి కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశాను. కానీ, అందులో రెండో భాగంలో కొన్ని మార్పులు చెయ్యాల్సి ఉంది. అందుకే స్క్రిప్ట్‌ని రీవర్క్ చేయడానికి నాకు సమయం కావాలని చిరంజీవి(Chiranjeevi)ని కోరాను. ఆయన ఓకే అన్నారు. ఈ ప్రాజక్ట్ పూర్తి కాగానే చిరంజీవి సినిమాపై దృష్టి పెడతాను’’ అని తెలిపారు. ఇక వెంకీ తన మూడో చిత్రానికి కూడా రష్మికనే ఎంపిక చెయ్యడంతో నెట్టింట చర్చ మొదలైంది. రష్మిక తన సెంటిమెంట్‌గా మారిపోయిందని అనుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!