Ramarao On Duty: సీఐ మురళిగా వేణు

రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 07 Jul 2022 11:50 IST

రవితేజ(Raviteja) హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao On Duty). సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి(Venu) ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రకు  సంబంధించిన లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో వేణు ఖాకీ యూనీఫాంలో సీరియస్‌గా చూస్తూ కనిపించారు. ఆయన బ్యాడ్జ్‌పై ఉన్న పేరును బట్టి ఇందులో తను సీఐ మురళిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: సామ్‌ సిఎస్‌, కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని