Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
‘స్వయంవరం’, ‘చిరు నవ్వుతో’, ‘హనమాన్ జంక్షన్’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరిళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి.. గోపిక.. గోదావరి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి.
ఇంటర్నెట్ డెస్క్: ‘స్వయంవరం’, ‘చిరు నవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరిళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి.. గోపిక.. గోదావరి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). తనదైన హాస్యంతో గిలిగింతలు పెట్టే ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. సుమారు 9 ఏళ్లకు ‘రామారావు ఆన్ డ్యూటీ’ (RamaRao On Duty) అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ (Raviteja) హీరోగా శరత్ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వేణు సోషల్ మీడియా వేదికగా సినిమా సంగతులు పంచుకున్నారు.
* చాలాకాలం తర్వాత నటించడం ఎలా అనిపించింది?
వేణు: సినిమాలకే నేను తొలి ప్రాధాన్యమిస్తా. కానీ, అనివార్య కారణాల వల్ల కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నా. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత నటించడం చాలా సంతోషంగా ఉంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’తోపాటు ‘పారా హుషార్’ అనే సినిమాలోనూ కీలక పాత్ర పోషించా.
* ‘రామారావు’తోనే కమ్‌బ్యాక్ ఇవ్వడానికి కారణం?
వేణు: ఈ సినిమా దర్శక, నిర్మాతలు నాకు చాలా సార్లు ఫోన్ చేసి నటించమని అడిగినా ముందు నేను ఒప్పుకోలేదు. ‘మీరు ఈ చిత్రంలో నటించకపోయినా ఫర్వాలేదు. ఓసారి కలుద్దాం’ అని దర్శకుడు శరత్ మండవ మెసేజ్ చేశారు. ఓ సారి మీట్ అయ్యాం. ఆ ముచ్చట్లలో భాగంగా ‘మీ పాత్రను ఇలా అనుకుంటున్నా. మీకు నమ్మకం ఉంటే చేయండి’ అని ఆయన అన్నారు. నాకూ ఆ క్యారెక్టర్ బాగా నచ్చడంతో రెండుమూడు సార్లు శరత్‌తో చర్చించి, నటించేందుకు ఓకే చెప్పా. అంతకుముందు వేరే కథలూ విన్నా. అనుకోకుండా ఇది పట్టాలెక్కింది.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
వేణు: ఇంతకుముందు నేను పోషించినవన్నీ చాలా సరదా పాత్రలు. ఈ చిత్రంలో సీఐ మురళీగా పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తా. ఇందులో నేను ఎలా నటించానో ప్రేక్షకులే చెప్పాలి.
* రవితేజతో నటించడం గురించి చెప్తారా?
వేణు: ఆయన ఓ పవర్ హౌజ్. ఎంతో సరదాగా ఉంటాడు. నటనకు సంబంధించి ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తాడు. ఎంతో హోమ్ వర్క్ చేస్తాడు. పనిపై స్పష్టత ఉన్న వ్యక్తి. ఆయనతో నేను కలిసి నటించిన సన్నివేశాలన్నీ మీ అందరినీ మెప్పిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
గత వారం బాక్సాఫీస్ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. -
Priyadarshi: ఆ చిత్రానికి, ‘ఓం భీమ్ బుష్’కి పోలిక ఉండదు: ప్రియదర్శి
తన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు ప్రియదర్శి. -
Suriya 43: సూర్య 43వ చిత్రంపై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
తమిళ హీరో సూర్య కొత్త సినిమా ‘సూర్య43’గురించి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కొత్త అప్డేట్ ఇచ్చారు. -
Karthikeya 3: ‘కార్తికేయ 3’.. అధికారికంగా ప్రకటించిన నిఖిల్
‘కార్తికేయ 3’ని ఉద్దేశించి నిఖిల్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. త్వరలో ప్రారంభం కానుందన్నారు. -
Detective2: ‘డిటెక్టివ్2’.. 25ఏళ్లకు నా కల నిజమైంది: విశాల్
Vishal: విశాల్ స్వీయ దర్శకత్వంలో ‘డిటెక్టివ్2’ రూపొందుతున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
Gangs Of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ ఫిక్స్... వచ్చేది ఎప్పుడంటే?
విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. -
Venkaiah Naidu: ఇది సందేశాత్మక చిత్రం: నటుడు ఆర్కే సాగర్‌కు వెంకయ్య నాయుడి ప్రశంస
వెంకయ్య నాయుడు ‘ది 100’ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో రానున్న అజిత్.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్
హీరో అజిత్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో సినిమా చేయనున్నారు. -
Kalki: ‘కల్కి’పై అమితాబ్ పోస్ట్.. ఆ వార్తలకు చెక్!
‘కల్కి’ షూటింగ్ దాదాపు పూర్తయిందని అమితాబ్ అన్నారు. -
Indraja: కించపరచాలనే ఉద్దేశంతో ‘రజాకార్’ని తీయలేదు: ఇంద్రజ
‘రజాకార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కీలక పాత్ర పోషించిన ఇంద్రజ వేడుకలో పాల్గొని మాట్లాడారు. -
Thangalaan: తంగలాన్ వచ్చేది అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’ చిత్రం విడుదల ఎప్పుడో దర్శకుడు తెలిపారు. -
Rajamouli: లవ్‌స్టోరీలు కాదు మనదంతా యాక్షనే: రాజమౌళి
‘ప్రేమలు’ సక్సెస్ మీట్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. -
Mahesh Babu: రాజమౌళి మూవీలో మహేశ్ డ్యూయల్ రోల్.. నిజమేనా?
Mahesh babu-Rajamouli Movie: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే మూవీ గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. -
Sundeep Kishan: త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో సందీప్ కిషన్.. అప్డేట్ ఇచ్చిన హీరో
టాలీవుడ్ యువ కథానాయకుడు సందీప్ కిషన్ కొత్త సినిమాను ప్రకటించారు. -
Salaar 2: ‘సలార్2’పై అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీక్వెల్ ‘సలార్2’. తాజాగా దీనిపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. -
Upcoming Movies: ఈ వారం థియేటర్లో 10కి పైగా చిత్రాలు.. ఓటీటీలో ‘హను-మాన్’ ఇంకా ఎన్నో..!
ఈ వారం థియేటర్లో చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదికి పైగా చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. -
Tamannaah: డైరెక్టర్‌పై తమన్నా ప్రశంసలు.. 19 ఏళ్ల కెరీర్లో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ..
తన కెరీర్లో దర్శకుడు సంపత్ నందిలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు తమన్నా. ఎందుకంటే? -
Manjummel Boys: లూసిఫర్ రికార్డును బద్దలుకొట్టిన ‘మంజుమ్మెల్ బాయ్స్’
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమలో మరో రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మరో మూవీ వచ్చి చేరింది. -
Rajamouli: ‘ప్రేమలు’ టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు
‘ప్రేమలు’ (Premalu) చిత్రబృందంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తనకు నచ్చిందన్నారు. -
Dhanush: ధనుష్- నాగార్జున మూవీ టైటిల్ ఇదే.. ఆసక్తి రేకెత్తించేలా పోస్టర్
ధనుష్ 51వ సినిమా టైటిల్ ఖరారైంది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. -
Kalki: ‘కల్కి’లో ప్రభాస్ పేరేంటో తెలుసా.. అప్డేట్ షేర్ చేసిన టీమ్..
ప్రభాస్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నుంచి అప్డేట్ వచ్చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు