Actor Prabhu: ప్రముఖ నటుడికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

ప్రముఖ నటుడు ప్రభు (Prabhu) అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రభుకు చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Updated : 22 Feb 2023 11:47 IST

చెన్నై: ప్రముఖ నటుడు ప్రభు (Prabhu) అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఆయన్ని కుటుంబసభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారంటూ కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోమవారం రాత్రి తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌  చేసే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ వార్త చూసిన ఆయన అభిమానులు ప్రభు త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

శివాజి గణేశన్‌ (Sivaji Ganesan) కుమారుడిగా చిత్రపరిశ్రమలోకి వచ్చిన ప్రభు కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ నటుడే అయినా తన అద్భుతమైన యాక్టింగ్‌తో తెలుగు వారికీ ఎంతో చేరువయ్యాడు. ‘చంద్రముఖి’ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్‌లోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ‘వారసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి మెప్పించాడు. ప్రస్తుతం ప్రభు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పొన్నియిన్‌ సెల్వన్‌ సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని