Sulochana: బాలీవుడ్‌ ‘అమ్మ’ సులోచన కన్నుమూత

హిందీ, మరాఠీ చిత్రాల్లో తల్లి పాత్రలతో అలరించిన సీనియర్‌ నటి సులోచనా లాట్కర్‌ (94) ఆదివారం కన్నుమూశారు.

Updated : 05 Jun 2023 12:42 IST

సంతాపం తెలిపిన ప్రధాని

ముంబయి, దిల్లీ: హిందీ, మరాఠీ చిత్రాల్లో తల్లి పాత్రలతో అలరించిన సీనియర్‌ నటి సులోచనా లాట్కర్‌ (94) (Sulochana) ఆదివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె దాదర్‌లోని సుశ్రూష ఆసుపత్రిలో మృతిచెందినట్లు సమీప బంధువు పరాగ్‌ అజ్గావ్‌కర్‌ ధ్రువీకరించారు. 1940లో నటిగా ఆమె కెరియర్‌ ప్రారంభించారు. ‘ఆయే దిన్‌ బహార్‌ కే’, ‘గోరా ఔర్‌ కాలా’, ‘దేవర్‌’, ‘కటీ పతంగ్‌’ తదితర 250కు పైగా చిత్రాల్లో ఆరు దశాబ్దాలపాటు నటించారు. వెండితెరపై ఎక్కువగా తెల్లచీరలో కనిపించే ఈమె 1960 మొదలు 1980 దాకా బాలీవుడ్‌లోని దాదాపు అందరు అగ్రనటులకు తల్లిగా నటించారు. 1999లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పొందిన సులోచనకు ఓ కుమార్తె ఉన్నారు. ‘‘సులోచనా జీ మరపురాని నటన మన సంస్కృతిని సుసంపన్నం చేసింది’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు