Veyi Daruveyi: దరువెయ్
సాయిరామ్ శంకర్ (Sairam Shankar), యాశ శివకుమార్ జంటగా నటించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’ (Veyi Daruveyi). నవీన్ రెడ్డి దర్శకుడు. దేవరాజు పొత్తూరు నిర్మించారు.
సాయిరామ్ శంకర్ (Sairam Shankar), యాశ శివకుమార్ జంటగా నటించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’ (Veyi Daruveyi). నవీన్ రెడ్డి (Naveen Reddy) దర్శకుడు. దేవరాజు పొత్తూరు నిర్మించారు. సునీల్, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టైటిల్ గీతాన్ని హీరో నాగచైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పాట చాలా బాగుంది. సినిమా చూడాలని కుతూహలాన్ని రేపుతోంది. కచ్చితంగా ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సినిమా కథ చెప్పగానే సాయి చేస్తానన్నారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు నవీన్. హీరో సాయిరామ్ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రానికి ఈ పాటే బెస్ట్ డ్యాన్స్ నంబర్. తప్పకుండా ఈ పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. సాయిరామ్ కెరీర్‌లో మరొక మంచి చిత్రమవుతుంది’’ అన్నారు నిర్మాత దేవరాజు. ఈ సినిమాకి సంగీతం: భీమ్స్, ఛాయాగ్రహణం: ముత్యాల సతీష్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ladakh: తూర్పు లద్దాఖ్ వద్ద వ్యూహాత్మక రహదారి నిర్మాణం ప్రారంభం
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
-
Sports News
IND Vs NZ : రెండో టీ20లో ఉమ్రాన్ స్థానంలో అతడిని తీసుకోవాలి : మాజీ క్రికెటర్
-
India News
S Jaishankar: ‘అది 1962లోనే జరిగింది..’ రాహుల్‌కు జైశంకర్ కౌంటర్
-
India News
రూ.1.5 కోట్లకు అడిగినా.. ఆ దున్నను అమ్మేది లేదట
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు