Vinaro Bhagyamu Vishnu Katha: చూడరో భాగ్యము.. విష్ణుకథ

‘‘మాది తిరుపతి. నా పేరు విష్ణు. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ’’ అంటున్నారు కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళీ కిషోర్‌ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు.

Updated : 15 Jul 2022 07:56 IST

‘‘మాది తిరుపతి. నా పేరు విష్ణు. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ’’ అంటున్నారు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడాయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). మురళీ కిషోర్‌ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాస్‌ నిర్మాత. శుక్రవారం కిరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ‘‘ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూనే తిరుగుతుంటాయ్‌’’ అంటూ కిరణ్‌ పలికే సంభాషణతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రచార చిత్రాల్లో కనిపించిన సన్నివేశాల్ని బట్టి.. ఆయనిందులో తిరుపతికి చెందిన ఓ మధ్యతరగతి కుర్రాడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన తిరుపతిలో ఏం చేస్తుంటాడు? తన కథేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు