Vicky Kaushal: కత్రినా నా జీవితంలోకి వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకున్నా: విక్కీ కౌశల్
కత్రినా కైఫ్(Katrina Kaif)తో కలిసి జీవితాన్ని పంచుకోవడం గురించి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) మాట్లాడారు. ఆమె జీవితంలోకి వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
ముంబయి: బాలీవుడ్(Bollywood)లోని క్యూట్ జంటల్లో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఒకరు. అభిమానుల కోసం తరచూ సోషల్‌మీడియాలో వారి ఫొటోలను పంచుకుంటుంటారు. తాజాగా ఓ ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ నిరంతరం నేర్చుకోడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.
‘‘నేను భర్తగా, కొడుకుగా, స్నేహితుడిగా, నటుడిగా ఎందులోనూ పరిపూర్ణత సాధించలేదు. మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. పర్‌ఫెక్ట్‌గా ఉండడమే లక్ష్యంగా పనిచేస్తుంటాను. నేను ఆదర్శవంతమైన భర్తనని కూడా అనుకోను. కానీ, నిన్నటి కంటే రేపు ఉత్తమంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నాలోపాలను సరిచేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అన్నారు. ఇక కత్రినా (Katrina Kaif)తో కలిసి జీవించడం గురించి మాట్లాడుతూ..‘‘కత్రినా నా జీవితంలోకి వచ్చాకా అంతా మారిపోయింది. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నేను ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి కత్రినా ఎంతో సహకరిస్తోంది’’ అని తెలిపాడు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల ‘గోవింద నామ్ మేరా’(Govinda Naam Mera) సినిమాలో కనిపించిన విక్కీ ప్రస్తుతం లక్ష్మణ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతడు మొదటిసారి సారా అలీఖాన్(Sara Ali Khan)తో స్క్రీన్ పంచుకోనున్నాడు. దీనితో పాటు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో రానున్న డుంకీ(Dunki) సినిమాలో కనిపించనున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
-
Politics News
Ganta Srinivasa Rao: ఫైనల్స్‌లో వైకాపా ఉండదు
-
Politics News
Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే