Vijay Sethupathi: రెండు భాగాలుగా...

భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘విడుతలై’ ఒకటి. వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తుండడం... విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తుండడమే అందుకు కారణం.

Updated : 04 Sep 2022 06:56 IST

భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘విడుతలై’ (Viduthalai) ఒకటి. వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తుండడం... విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్ర పోషిస్తుండడమే అందుకు కారణం. ఎల్రెడ్‌ కుమార్‌, ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. సూరి, గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘తొలి భాగం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమిళంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. రెండో భాగంలో వచ్చే కొన్ని పోరాటఘట్టాల్ని ప్రస్తుతం కొడైకెనాల్‌లో పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నాం. ఉత్కంఠభరితంగా సాగే ఆ సన్నివేశాల్లో బల్గేరియా నుంచి వచ్చిన ఓ స్టంట్‌ బృందం పాల్గొంటోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రూ.10 కోట్ల విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జ్‌ సెట్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యాన్ని గుర్తు చేసే సెట్‌ కూడా సినిమాకి కీలకం. త్వరలోనే సినిమాల విడుదల తేదీల్ని ప్రకటిస్తామ’’ని తెలిపారు. భవానీ శ్రీ, ప్రకాష్‌రాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: వేల్‌రాజ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని