Vignesh Shivan:: ‘బాహుబలి’ సీన్‌ రీక్రియేట్‌ చేసిన విఘ్నేశ్‌ శివన్‌.. సూపర్‌ అంటున్న ఫ్యాన్స్‌

విఘ్నేశ్‌ శివన్‌ ‘బాహబలి’ సీన్‌ను రీక్రియేట్‌ చేశారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Updated : 17 Jun 2024 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నయనతార దంపతులు ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వారి టూర్‌ల విశేషాలతో పాటు పిల్లల ఫొటోలను పంచుకుంటుంటారు. తాజాగా విఘ్నేశ్‌ (Vignesh Shivan) షేర్‌ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘బాహుబలి’లో శివగామి పిల్లాడిని ఎత్తుకునే సీన్‌ను ఆయన రీక్రియేట్‌ చేశారు.

విఘ్నేశ్‌ నీళ్లలో ఉండి ఉయిర్‌, ఉలగమ్‌లను చేతులతో పైకి ఎత్తిపట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. వీటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మై డియర్‌ బాహుబలి 1, 2.. మీ ఇద్దరి వల్లే నా జీవితం మరింత అందంగా మారింది. లవ్‌ యూ’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ ఫొటోలకు నెటిజన్లు సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వీళ్లలో ఒకరు అమరేంద్ర బాహుబలి, మరొకరు మహేంద్ర బాహుబలి’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘మీ క్రియేటివిటీ బాగుంది’ అని మరొకరు ప్రశంసించారు. ఫాదర్స్ డే సందర్భంగా నయనతార (Nayanthara) పెట్టిన పోస్ట్‌ కూడా ఆకట్టుకుంటోంది. ‘ప్రపంచంలోని ఉత్తమ నాన్నకు శుభాకాంక్షలు. పిల్లలపై నీ ప్రేమ చూస్తే ముచ్చటేస్తుంది. నీతో కలిసి జీవితాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.

దర్శన్‌పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?

సుమారు ఏడేళ్లు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌లు పెద్దల అంగీకారంతో 2022లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సరోగసీ ద్వారా గతేడాది ఉయిర్‌, ఉలగమ్‌లకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల వారి రెండో పెళ్లిరోజును విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని