Vignesh Shivan: ఆ జోడీ కుదరనట్టేనా.. ట్విటర్ నుంచి పేరు తీసేసిన విఘ్నేశ్ శివన్
దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) తదుపరి ప్రాజెక్ట్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. అజిత్ (Ajith) హీరోగా ఆయన చేయనున్న సినిమా ఆగిపోయిందని పలువురు నెటిజన్లు అంటుంటే మరికొంతమంది అది అవాస్తవమని వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: విభిన్నమైన కథలతో తరచూ ప్రేక్షకులను అలరిస్తుంటారు దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). తాజాగా ఆయన చేసిన ఓ పని ఇప్పుడు సినీ ప్రియులను షాక్‌కు గురి చేసింది. ఆయన అలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..!
గతేడాది విడుదలైన ‘కాతువాకుల రెండు కాదల్’తో ప్రేక్షకులను అలరించారు విఘ్నేశ్. ఈ సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను స్టార్ హీరో అజిత్(Ajith)తో చేస్తున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. అజిత్ 62(AK 62)వ చిత్రంగా లైకా ప్రొడెక్షన్స్ పతాకంపై ఇది పట్టాలెక్కనున్నట్లు గతంలో ప్రకటన విడుదలైంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే రోజు కోసం అజిత్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న తరుణంలో విఘ్నేశ్ ఈ సినిమా నుంచి వైదొలగినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా విఘ్నేశ్ శివన్ సైతం తన ట్విటర్ బయో నుంచి AK 62 అనే పేరును తొలగించారు. దీంతో ఈ సినిమా గురించి ఇప్పటివరకూ వచ్చిన వార్తలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. ఈ జోడీ ఇప్పటికి కుదరనట్టేనా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు అజిత్ - విఘ్నేశ్ శివన్ ప్రాజెక్ట్ కొనసాగుతుందా? లేదా? అనే విషయంపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా
-
India News
Kerala: మహిళల వేషధారణలో పురుషుల పూజలు
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్: ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
-
World News
Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా.. ’: బైడెన్ వీడియో వైరల్
-
India News
Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే