Nayanthara: ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. నయనతారకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన విఘ్నేశ్
నయనతార (Nayanthara)- విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)లు గతేడాది జూన్‌లో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నేడు వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేశ్ పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
హైదరాబాద్: లేడీ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను గతేడాది ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ విఘ్నేశ్ పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వాళ్ల పిల్లల ఫొటోలను కూడా షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
‘‘నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది అయిపోయింది. ఈ సంవత్సరంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. ఎన్నో ఊహించని పరాజయాలు.. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఇలాంటి ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చి నిన్నూ పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం ఇచ్చే బలం మరేదీ ఇవ్వలేదు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నిన్ననే పెళ్లి చేసుకున్నట్లు ఉంది. అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నాను. మనమిద్దరం కలిసి సాధించడానికి చాలా ఉన్నాయి. మన ఆనందమైన జీవితంలోకి మరో ఏడాదికి స్వాగతం పలుకుదాం’’ అంటూ నయనతారకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక నయనతార (Nayanthara)- విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)లు గతేడాది అక్టోబరులో తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. తమ ట్విన్ బేబీ బాయ్స్‌కు ఉయిర్, ఉలగమ్ అని పేర్లు పెట్టినట్టు తెలిపారు. అయితే, ఈరోజు వాళ్లకు సంబంధించిన రేర్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!
-
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం
-
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు