Updated : 27 May 2022 08:13 IST

Vijay: హైదరాబాద్‌ టు చెన్నై

విజయ్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా 25రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ పూర్తయింది. ఇందులో భాగంగా చిత్ర ప్రధాన తారాగణంపై చాలా కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ విషయాల్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విజయ్‌, వంశీ కలిసి ఉన్న సెట్లోని ఫొటోను నెట్టింట పంచుకున్నారు. విజయ్‌ నటిస్తున్న 66వ చిత్రమిది. తదుపరి షెడ్యూల్‌ చెన్నైలో జూన్‌ తొలివారంలో మొదలు కానున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, ప్రభు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని