Bichagadu3: ‘బిచ్చగాడు3’పై విజయ్‌ ఆంటోనీ క్లారిటీ.. మొదలయ్యేది అప్పుడే!

Vijay Antony: ‘బిచ్చగాడు2’కు కొనసాగింపుగా ‘బిచ్చగాడు3’ సినిమాను తెరకెక్కించనున్నట్లు విజయ్‌ ఆంటోనీ చెప్పారు.

Published : 22 May 2023 18:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బిచ్చగాడు2’ (Bichagadu2) అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్‌ ఆంటోని (Vijay Antony). ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. రివ్యూలకు భిన్నంగా మౌత్‌టాక్‌తో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘బిచ్చగాడు3’పై విజయ్‌ ఆంటోనీ స్పందించారు. ‘‘బిచ్చగాడు2’కు కొనసాగింపుగా మూడో భాగం కూడా వస్తుంది. అది పూర్తిగా విభిన్నమైన కథతో తెరకెక్కుతుంది. స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి ఏడాదికిపైనే సమయం పట్టవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో సినిమాను మొదలు పెడతా. ‘బిచ్చగాడు3’కి కూడా నేనే దర్శకత్వం వహిస్తా’’ అన్నారు.

ఇక ‘బిచ్చగాడు2’ కథ విషయానికొస్తే, దేశంలోని ధనవంతుల్లో ఒకడైన విజయ్‌ గురుమూర్తి (విజయ్‌ ఆంటోని)ని మోసం చేసి, అతడి మెదడు స్థానంలో సత్య (విజయ్‌ ఆంటోని) అనే బిచ్చగాడి మెదడును అమరుస్తారు. మరి సత్య మెదడు విజయ్‌ గురుమూర్తికి అమర్చాక ఏం జరిగింది? అతనిని అడ్డం పెట్టుకొని విజయ్‌ ఆస్తి దక్కించుకోవాలనుకున్న వారికి సత్య ఎలా బుద్ధి చెప్పాడు? తప్పిపోయిన తన చెల్లిని కనిపెట్టేందుకు అతడు ఏం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? పేద ప్రజల కోసం మొదలు పెట్టిన యాంటీ బికిలీ మాల్‌ ఏమైంది? దాని విషయంలో ఎదురైన రాజకీయ సవాళ్లను ఎలా అధిగమించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని