Published : 28 May 2022 02:36 IST

Jwala Movie: విజయ్‌ ఆంటోని ‘జ్వాల’ టీజర్‌ చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిచ్చగాడు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోని. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న సినిమా ‘జ్వాల’. నవీన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమ్మ క్రియేషన్స్‌ పతాకం పై రానుంది. ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు రానా తన ట్విటర్ వేదికగా విడుదల చేశాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను రష్యా, స్విట్జర్లాండ్‌ లలో చిత్రీకరించారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన అక్షరహాసన్‌ నటిస్తోంది. విజయ్‌ ఆంటోనితో పాటు అరుణ్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని