‘గాజు ముక్క కూడా వేస్టే.. కానీ కంట్లో పడితే’

వైవిధ్య కథా చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. అయితే,

Published : 02 Jan 2021 16:32 IST

హైదరాబాద్‌: వైవిధ్య కథా చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. అయితే, తొలినాళ్లలో ఆయన సినిమాలు, కథల ఎంపికలో కనిపించిన విలక్షణత ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఐదు భాషల్లో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

ఇందులో విజయ్‌ ట్యూషన్‌ మాస్టర్‌గా కనిపించనున్నారు. ‘గాజు ముక్క కూడా వేస్టే.. కానీ కంట్లో పడితే రక్తంగా మారుతుంది’ అంటూ విజయ్‌ గురించి విలన్‌ చెబుతున్న మాస్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని