విడుదలకు సిద్ధమవుతున్న ‘విజయ రాఘవన్‌’

వైవిధ్య కథా చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఆయన కీలక పాత్రలో నటించిన

Published : 05 Feb 2021 15:12 IST

హైదరాబాద్‌: వైవిధ్య కథా చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 2021లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో విజయ్‌ ట్యూషన్‌ మాస్టర్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని