Vijay: సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘అరబిక్‌ కుత్తు’

విజయ్‌ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బీస్ట్‌’. పూజాహెగ్డే కథానాయిక. నెల్సన్‌ దర్శకుడు. అన్నిరకాల కమర్షియల్‌ హంగులతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో భాగంగా....

Published : 28 Feb 2022 01:15 IST

చెన్నై: విజయ్‌ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బీస్ట్‌’. పూజాహెగ్డే కథానాయిక. నెల్సన్‌ దర్శకుడు. కమర్షియల్‌ హంగులతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్‌గా ‘అరబిక్‌ కుత్తు’ను ఇటీవల విడుదల చేసింది. ‘పాన్‌ వరల్డ్‌ పాట’గా వచ్చిన ఈ సాంగ్‌.. విడుదలైన నాటి నుంచే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

కాగా, తాజాగా ‘అరబిక్‌ కుత్తు’ పాట సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. విడుదలైన రెండు వారాల్లోనే  100 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్‌ పోస్ట్‌ రిలీజ్‌ చేసింది. పాట విడుదలైన 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్‌ అందుకుందని.. నాలుగు రోజుల్లో ఆ సంఖ్య 50 మిలియన్లకు చేరిందని తెలిపింది. ఈక్రమంలోనే తాజాగా ఈ పాట 100 మిలియన్ల వ్యూస్‌ దాటింది. 3.7 మిలియన్ల మంది ఈ పాటను లైక్‌ చేశారు. ఇప్పటికే ఈ పాటకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. నెట్టింట్లో ఎక్కడ చూసినా ‘హలమితీ హబీబో’ అంటూ ఈ పాట రీల్సే కనిపిస్తున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని