Rashmika: ‘డియర్‌ కామ్రేడ్‌’పై పోస్ట్‌ పెట్టిన విజయ్‌ దేవరకొండ.. స్పందించిన రష్మిక

Updated : 15 Jun 2024 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డియర్‌ కామ్రేడ్‌’పై హిందీ ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు ధన్యవాదాలు చెప్పారు విజయ్ దేవరకొండ. భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక నటించిన ఈ చిత్రం 2019లో విడుదల కాగా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు యూట్యూబ్‌లో భారీ ప్రేక్షకాదరణ లభించింది. ఏకంగా 400 మిలియన్ల మంది దీన్ని చూశారు. దీనిపై ఆనందం వ్యక్తంచేస్తూ విజయ్‌ దేవరకొండ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌కు రష్మిక స్పందించారు.

‘400 మిలియన్ల మంది దీన్ని వీక్షించారు. 2019లో ఈ సినిమా రిలీజైన రోజు వచ్చిన స్పందనకు మేమెంతో బాధపడ్డాం.. కానీ, ఈరోజుకూ ఈ మూవీ అంటే మాకెంతో ఇష్టం. ‘డియర్‌ కామ్రేడ్‌’ నాకు నచ్చిన సినిమా.. నచ్చిన కథ’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను రష్మిక (Rashmika) తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు. ‘400 మిలియన్స్‌ లవ్‌. ‘డియర్‌ కామ్రేడ్‌’ నాకెప్పటికీ అత్యంత ప్రత్యేకమైన సినిమా’ అని రాసుకొచ్చారు.

వాళ్ల స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొనే కల్కి రూపొందించా: నాగ్‌ అశ్విన్‌

ఇక విజయ్‌-రష్మిక కలిసి రెండు సినిమాల్లో నటించారు. వాటిలో ‘గీత గోవిందం’ బ్లాక్‌ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ‘డియర్‌ కామ్రేడ్‌’ (Dear Comrade) అంచనాలను అందుకోనప్పటికీ స్క్రీన్‌పై ఈ జోడి ప్రేక్షకులకు వినోదాన్నిచ్చింది. ఈ చిత్రం తర్వాత ఎంతోమందికి ఫేవరెట్‌ జోడిగా మారింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్‌ మూడు చిత్రాల్లో నటిస్తుండగా రష్మిక 5 సినిమాల్లో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని