Samantha: సామ్‌పై యుద్ధం ప్రకటించిన విజయ్‌ దేవరకొండ

అగ్రకథానాయిక సమంతపై నటుడు విజయ్‌ దేవరకొండ యుద్ధం ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరూ ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఫీల్‌ గుడ్ ప్రేమ కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా....

Updated : 18 May 2022 12:46 IST

ప్రతీది రికార్డ్‌ అవుతోందంటూ పోస్ట్ 

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంతపై నటుడు విజయ్‌ దేవరకొండ యుద్ధం ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరూ ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఫీల్‌ గుడ్ ప్రేమ కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా చిత్రీకరణ గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్‌లో జరుగుతోంది. ‘మహానటి’తో పరిచయమైన విజయ్‌-సామ్‌ ఈ సినిమాతో మంచి స్నేహితులుగా మారారు. దీంతో, షూట్‌లో ఏ కాస్త సమయం దొరికినా వీరిద్దరూ సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. జోక్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా నటుడు వెన్నెల కిషోర్‌తో కలిసి వీరిద్దరూ ఓ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారు. ఇందులో సమంత విజయం సాధించారు. విజయ్‌పై గెలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆ గేమ్‌ విన్నింగ్‌ బోర్డ్‌ని ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె షేర్‌ చేశారు. ‘‘విజయ్‌ దేవరకొండ లాంటి ప్రత్యర్థిపై గేమ్‌ గెలిచినప్పుడు విజయానందం మరింత ఎక్కువగా ఉంటుంది’’ అని సామ్‌ పోస్ట్‌ పెట్టగా.. దానిపై స్పందించిన విజయ్‌.. ‘‘యుద్ధం ప్రకటిస్తున్నా..!! ఇకపై ప్రతి విజయం రికార్డ్‌ కానుంది’’ అని రిప్లై ఇచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts