Updated : 20 Jan 2021 13:14 IST

అప్పట్లో ఎంతో బాధపడ్డా: విజయ్‌ దేవరకొండ

భావోద్వేగానికి గురైన హీరో

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తాను ఎంతో బాధపడ్డానని టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. కెరీర్‌ ఆరంభంలో ‘నువ్విలా’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన విజయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’తో హీరోగా సెన్సేషనల్‌ అయ్యారు. ఆ సినిమాతో యువతలో క్రేజ్‌ సంపాదించుకుని ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియన్‌ సినిమా ‘లైగర్‌’. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్యపాండే కథానాయిక. తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో విజయ్‌ పూర్తి‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌పై ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు పాలాభిషేకాలు, తీన్‌మార్‌ డ్యాన్స్‌లు, కేక్‌ కటింగ్స్‌తో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. దీంతో అభిమానులు చూపించిన ప్రేమకు విజయ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

‘మీరే నా ప్రేమ (అభిమానులను ఉద్దేశిస్తూ). ‘లైగర్‌’ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైన రోజు మీరు నన్ను ఎంతగానో భావోద్వేగానికి గురి చేశారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యాను. ప్రేక్షకుల్లో ఒక్కరైనా నా నటనను గుర్తిస్తారా? నా సినిమాలు చూడడానికి థియేటర్‌కు వస్తారా?అని ఒకానొక సమయంలో ఎంతో బాధపడేవాడిని. ‘లైగర్‌’ పోస్టర్‌ విడుదల చేసిన తర్వాత ఎన్నో ప్రాంతాల్లో జరిగిన సెలబ్రేషన్స్‌ చూసి నాకెంతో ఆనందంగా అనిపించింది. టీజర్‌ విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి వేడుకలే జరుగుతాయని గ్యారంటీ ఇస్తున్నా... నా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి.
మీ
విజయ్‌ దేవరకొండ’ 

ఇదీ చదవండి

#VD10.. టైటిల్‌ ప్రకటించిన టీమ్‌

 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని