family star: వేసవిలో ఫ్యామిలీ స్టార్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్‌’ విడుదల తేదీ ఖరారైంది. వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి.

Updated : 03 Feb 2024 09:54 IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్‌’ విడుదల తేదీ ఖరారైంది. వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. మధ్య తరగతి జీవితాల్ని ప్రతిబింబించేలా...  సంచి భుజంపై వేసుకుని,  ఆధార్‌కార్డ్‌ నోట్లో పెట్టుకుని పరిగెత్తుతూ కనిపించారు విజయ్‌ దేవరకొండ. ఈ చిత్రంలో ఆయనకి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు - శిరీశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ వినోదంతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: కేయూ మోహనన్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు