నువ్వసలు తగ్గొద్దు..ఫీనిక్స్‌లా తిరిగిరావాలి: విజయ్‌ దేవరకొండకు ఫ్యాన్స్‌ మద్దతు

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), అనన్యపాండే(Ananya Panday) జంటగా నటించిన లైగర్(‌Liger) ఆశించిన ఫలితం సాధించకపోవడంతో ఆ చిత్రయూనిట్‌ నిరాశలో మునిగిపోయింది. దానికి తోడు సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ ఎక్కువవ్వడంతో...

Published : 14 Sep 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), అనన్యపాండే(Ananya Panday) జంటగా నటించిన లైగర్(‌Liger) ఆశించిన ఫలితం సాధించకపోవడంతో ఆ చిత్రయూనిట్‌ నిరాశలో మునిగిపోయింది. దానికి తోడు సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ ఎక్కువవ్వడంతో, లైగర్‌ దర్శక, నిర్మాతలు వారి వ్యక్తిగత సోషల్‌మీడియా ఖాతాలకు కొంతకాలం విరామం ఇచ్చారు. అయితే చిత్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తాజాగా జరిగిన సైమా వేడుకకు హాజరయ్యాడు. సైమా వేడుకలో సందడి చేసిన విజయ్‌ ఎప్పటిలానే తన అభిమానులను ఖుషీ చేశాడు.

చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఒక పోస్ట్‌ కూడా పెట్టాడు. లైగర్‌ విడుదలకు ముందు చివరి పోస్ట్ పెట్టిన విజయ్, ఇప్పుడు తానొక్కడే నిల్చుని ఉన్న ఫొటోని ఉంచి ‘సింగిల్‌ ఫైటర్‌’ అని క్యాప్షన్‌ జత చేశాడు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే విజయ్‌ ‘లైగర్‌’ విడుదలయ్యాక పెట్టిన మొదటి పోస్ట్‌ ఇదే. ఈ ఫోటోకు 19గంటల్లోనే మిలియన్‌ లైకులు వచ్చాయి. విజయ్‌కు మద్దతు తెలుపుతూ అతని అభిమానులు పలు కామెంట్స్ పెట్టారు. ‘నీ సినిమా ప్లాఫ్ అయినా, నువ్వు నిజమైన లైగర్‌వి’, ‘నువ్వసలు తగ్గొద్దన్న’, ‘ట్రోల్స్‌ ని పట్టించుకోవద్దు నువ్వొక హీరో’, ‘ఫీనిక్స్‌లా కంబ్యాక్‌ ఇవ్వాలి’, ‘నువ్వు మళ్లీ మా ముందుకొచ్చావ్‌..హ్యాట్సాఫ్‌’ అంటూ కామెంట్లతో విజయ్‌ని అభినందించారు.

‘లైగర్‌’ అనంతరం విజయ్‌ ‘జనగణమన’ చేయాల్సి ఉన్నా ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇంకా సమంత(Samantha)తో కలిసి నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఖుషి(Kushi) డిసెంబరు 23న విడుదలవ్వాల్సి ఉంది. శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదలవనున్నట్లు చిత్ర యూనిట్‌ ఇదివరకే ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని