Vijay Devarakonda: పాములతో ఆడుతూ.. పులి పిల్లలకు పాలు పడుతూ.. రౌడీ హీరో వీడియో వైరల్
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇటీవల దుబాయ్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హైదరాబాద్: తన సినిమాలతో యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). అభిమానులు రౌడీ హీరో అని పిలుచుకునే విజయ్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ అవుతోంది. సాధారణంగా షూటింగ్ విరామ సమయాల్లో విహార యాత్రలకు వెళ్తూ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుటాడు విజయ్. తాజా టూర్‌కు సంబంధించిన వీడియోను విజయ్ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు ‘‘ఇది విహార యాత్ర కాదు.. సాహస యాత్ర’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇటీవల విజయ్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న జంతువులతో సరదాగా గడిపారు. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘‘జీవితంలో మరో అందమైన జ్ఞాపకం. ఈ పార్కులో వాళ్లు నాకు పాములంటే ఉన్న భయాన్ని పోగొట్టారు. జంతువుల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అందమైన సింహం, పులి పిల్లలతో ఆడుకోవడానికి అవకాశం ఇచ్చారు’’ అని రాశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘జాగ్రత్త అన్న’ అని ఒకరు అంటే..‘నిజంగానే రౌడీ హీరోవి నువ్వు’ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ అగ్ర కథానాయిక సమంత (Samantha)తో కలిసి ‘ఖుషి’ (Kushi) సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. మిగతా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దీనితో పాటు పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి కథను కూడా విజయ్ ఓకే చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
భూ పరిహారం నొక్కేసిన వైకాపా నేత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Andhra News: ఇంటర్ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు.. భౌతికశాస్త్రం ప్రశ్నకు 2 మార్కులు
-
India News
Supreme Court: లోక్‌సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్‌పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి