Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ సమంతల ప్రాజెక్ట్‌ షురూ

‘లైగర్‌’ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు. రౌడీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘లైగర్‌’ విడుదల కాకముందే ఆయన.. పూరీతో ఇటీవల ‘జనగణమన’ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే...

Updated : 21 Apr 2022 14:44 IST

ఐరోపా నుంచి వచ్చేసిన రౌడీ బాయ్‌

హైదరాబాద్‌: ‘లైగర్‌’ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు. రౌడీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘లైగర్‌’ విడుదల కాకముందే ఆయన.. పూరీతో ఇటీవల ‘జనగణమన’ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా విజయ్‌ దేవరకొండ మరో ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టారు. ‘మజిలీ’, ‘నిన్నుకోరి’ వంటి సున్నితమైన ప్రేమకథలతో ప్రేక్షకులకు చేరువైన శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

సమంత హీరోయిన్‌.. ‘ఖుషి’ టైటిల్‌..!

విజయ్‌ దేవరకొండ 11వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో విజయ్‌కు జోడీగా సమంత కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ‘మహానటి’లో కలిసి నటించి మెప్పించారు. మనసుని హత్తుకునే ప్రేమకథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని, దీనికి ‘ఖుషి’ టైటిల్‌ పెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.

యూరప్‌ నుంచి వచ్చేసిన విజయ్‌..!

‘లైగర్‌’ ప్రమోషన్స్‌, ‘జనగణమన’ షూట్‌, శివ నిర్వాణ ప్రాజెక్ట్‌.. ఇలా వరుస లైనప్స్‌ ఉండటంతో వర్క్‌లైఫ్‌ నుంచి విజయ్‌ కాస్త బ్రేక్‌ తీసుకున్నారు. పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీతో కలిసి ఆయన గతవారం యూరప్‌ టూర్‌కు వెళ్లారు. టూర్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను సైతం ఆయన తరచూ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే వెకేషన్‌ పూర్తి చేసుకొని బుధవారం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని