Vijay Devarakonda: రష్మికతో పెళ్లి.. తనదైన శైలిలో స్పందించిన విజయ్‌ దేవరకొండ

తన స్నేహితురాలు, నటి రష్మికను నటుడు విజయ్‌ దేవరకొండ పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ‘గీతగోవిందం’లో కలిసి నటించిన వీరిద్దరూ ఆన్‌స్క్రీన్...

Updated : 23 Feb 2022 15:53 IST

హైదరాబాద్‌: తన స్నేహితురాలు, నటి రష్మికను నటుడు విజయ్‌ దేవరకొండ పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ‘గీతగోవిందం’లో కలిసి నటించిన వీరిద్దరూ ఆన్‌స్క్రీన్ లవ్లీ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ‘డియర్‌ కామ్రేడ్‌’లో ఈ జంట మరోసారి రొమాన్స్‌ చేసింది. ఈ చిత్రం ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఈ జంటకు మాత్రం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా టాక్‌. వీరి ప్రేమాయణం ఇరు కుటుంబపెద్దలకు తెలుసనీ.. అందుకే విజయ్‌ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు రష్మిక తరచూ హాజరవుతున్నారనీ, అలాగే విజయ్‌ ఫ్యామిలీతో రష్మిక తరచూ హాలీడేస్‌కు వెళ్తున్నారనీ.. అందరూ చెప్పుకొంటున్నారు.

ఈ క్రమంలోనే విజయ్ - రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. సీక్రెట్‌ డేటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేయాలని వీరు నిర్ణయించుకున్నారని.. కుటుంబపెద్దలు కూడా పెళ్లికి ఓకే అన్నారని, త్వరలోనే టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు వినిపించనున్నాయని చిత్రసీమ కోడైకూస్తోంది. కాగా, పెళ్లి వార్తలపై తాజాగా విజయ్ పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలేనని అన్నారు. ‘‘అవన్నీ పనికి రాని వార్తలే’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానంతో పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని