Vijay Devarakonda: విజయ్‌ - సమంత.. కొత్త చిత్రానికి శ్రీకారం

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యేర్నేని, వై.రవిశంకర్‌   సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయరాం, సచిన్‌

Updated : 22 Apr 2022 12:48 IST

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యేర్నేని, వై.రవిశంకర్‌   సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ క్లాప్‌ కొట్టగా.. మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ దర్శకుడికి స్క్రిప్ట్‌ అందించారు. ‘మహానటి’ వంటి హిట్‌ తర్వాత విజయ్‌, సమంత కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆర్మీ నేపథ్యంలో సాగే కథతో.. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందనున్నట్లు సమాచారం. ఈనెలలోనే కశ్మీర్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. అక్కడ ఓ సుదీర్ఘ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌, వైజాగ్‌, అల్లెప్పిలలో మిగిలిన కీలక షెడ్యూల్స్‌ పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో అలీ, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా.. జి.మురళి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని