Published : 15/01/2022 01:48 IST

Vijay Devarakonda : చిరంజీవికి విజయ్‌ దేవరకొండ ‘ఫుల్‌ సపోర్ట్’‌!

హైదరాబాద్‌: తనకు వైకాపా నుంచి రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్టు వచ్చిన వార్తల్ని ఖండిస్తూ మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌లో పెట్టిన హ్యాష్‌ట్యాగ్‌కు యువ హీరో విజయ్‌ దేవరకొండ పూర్తి మద్దతు ప్రకటించారు. చిరంజీవి ట్విటర్‌లో జత చేసిన #GiveNewsNotViews హ్యాష్‌ట్యాగ్‌ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన విజయ్‌.. నా పూర్తి మద్దతు తెలుపుతున్నా (My Full support) అంటూ ట్వీట్‌ చేశారు. 

‘‘తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్‌. జగన్‌ను కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా.. ఆ మీటింగ్‌కు రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాల్లోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకు, చర్చలకు ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టమని కోరుతున్నాను’’ అంటూ చిరంజీవి #GiveNewsNotViews హ్యాష్‌టాగ్‌ను జతచేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ట్వీట్‌ ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున రీట్వీట్‌ చేస్తున్నారు. 

గతంలో తనపై వచ్చిన తప్పుడు వార్తలపై విజయ్‌ దేవరకొండ పోరాడిన విషయం తెలిసిందే. కరోనా తొలి వేవ్‌ సందర్భంగా విజయ్‌ చేసిన సేవా కార్యక్రమాలను తక్కువ చేస్తూ కొంతమంది దుష్ప్రచారం చేశారు. దీంతో విజయ్‌ ఆ వార్తలను బహిరంగంగా ఖండిస్తూ... ఆన్‌లైన్‌లో చిన్నపాటి ఉద్యమమే చేశారు. ఆ సమయంలో అతడికి అనేకమంది సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవికి విజయ్‌ మద్దతు తెలిపాడు. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని