Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్‌ దేవరకొండ

కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికి ప్రేక్షకులందరూ తనని మర్చిపోవాలని నటుడు విజయ్‌ దేవరకొండ కోరారు. ‘లైగర్‌’..

Published : 20 Aug 2022 01:38 IST

అనన్య లాంటి పిల్లలు పుడితే.. భయంగా ఉంది

హైదరాబాద్‌: కెరీర్‌ ముగింపు దశకు వచ్చే సమయంలో.. ప్రేక్షకులందరూ తనని మర్చిపోవాలని నటుడు విజయ్‌ దేవరకొండ కోరారు. ‘లైగర్‌’ విడుదల సందర్భంగా ‘ట్విటర్‌ మూవీస్‌’ వేదికగా తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేశారు విజయ్‌, అనన్య. ట్విటర్‌ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఈ జోడీ సరదా సమాధానాలిచ్చింది. ఆ విశేషాలు మీకోసం..

మీరు ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు.. ‘లైగర్‌’లోని పాత్రకు తేడా ఏమిటి?

అనన్యా పాండే: ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒక లెక్క. ‘లైగర్‌’లో నేను పోషించిన తానియా వాటన్నింటినీ మించింది. తనియా పాత్రలో అన్నిరకాల భావోద్వేగాలు పండించే అవకాశం ఉంటుంది. నాటకీయత, డ్రామా క్వీన్‌, సమస్యలు సృష్టించే, సరదాగా ఉండే అమ్మాయి పాత్ర ఇది.

విజయ్‌లో మీకు నచ్చని, నచ్చే విషయాలు..?

అనన్యా పాండే: విజయ్‌లో నాకు నచ్చని విషయం ఏమిటంటే.. రాపిడ్‌ ఫైర్‌, Q And A సెషన్‌ని మొదట నన్నే మొదలు పెట్టమంటాడు. ఇక నచ్చే విషయమైతే తాను ప్రేమించే ప్రతి ఒక్కర్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు.

నటుడిగా కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికి ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు?  

విజయ్‌ దేవరకొండ: కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికి నన్నెవరూ గుర్తుపెట్టుకోవాలనుకోవడం లేదు. దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి. మీ జీవితాన్ని ఎంజాయ్‌ చేయండి.

అనన్యలో మీకు నచ్చే, నచ్చని విషయాలు?

విజయ్‌ దేవరకొండ: అనన్య ఎప్పుడూ ఏదో ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. అదస్సలు నాకు నచ్చదు. ఇలాంటి అల్లరి పిల్ల నాకు పుడితే ఏం చేయాలోనని భయమేస్తోంది. చిన్నప్పుడు అనన్య ఎలా ప్రవర్తించేదో తెలియదు.. కానీ, ఈమెను భరిస్తున్నందుకు చిక్కీ సర్‌‌, భావన మేడమ్‌కు సానుభూతి తెలియజేస్తున్నా. తనలో మంచి లక్షణం వచ్చేసరికి.. తనెప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటుంది. (మధ్యలో అనన్య అందుకొని కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి కదా. (నవ్వులు) 

మీ దృష్టిలో ‘ఫైటర్‌’ అంటే ఎవరు?

విజయ్‌ దేవరకొండ: సమాజంలో ప్రేమ, డబ్బు, గౌరవం, సంతోషం, మనకంటూ ఓ స్థానం సొంతం చేసుకోవడానికి పోరాటం చేసే వ్యక్తిని నేను ఫైటర్‌గా అభివర్ణిస్తా. నా పోరాటం కూడా అదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని