
Vijay Devarakond Rashmika: ముంబయిలో గ్రాండ్ పార్టీ.. రష్మిక, విజయ్ దేవరకొండకి మాత్రమే ఎంట్రీ..?
ముంబయి: బుధవారం సాయంత్రం ముంబయిలో జరగనున్న ఓ గ్రాండ్ పార్టీలో పాల్గొనేందుకు నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మికకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పార్టీలో వీరిద్దరూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కానున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ, వీరిద్దరూ పాల్గొనే పార్టీ ఏమిటంటే.. కరణ్ పుట్టినరోజు వేడుకలు. క్లాస్ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి నిర్మాత, దర్శకుడిగా బాలీవుడ్‌కి ఎంతోమంది నటీనటులు, దర్శకులను పరిచయం చేసిన వ్యక్తి కరణ్ జోహార్. బుధవారంతో ఆయన 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన పుట్టినరోజుని వేడుకగా చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేటి సాయంత్రం కరణ్ నివాసంలో ఓ భారీ బర్త్‌డే వేడుకకు సర్వం సిద్ధం చేశారు. కరణ్ మిత్రులు, సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్‌కు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. దీని ప్రకారం.. షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, మలైకా అరోఢా, ఆమె ప్రియుడు అర్జున్ కపూర్, కరీనాకపూర్ ఆమె భర్త సైఫ్ అలీఖాన్, రణ్‌బీర్ కపూర్, ఆయాన్ ముఖర్జీ, మనీశ్ మల్హోత్ర, రణ్వీర్ సింగ్, అనన్యపాండే, జాన్వీకపూర్, సారా అలీఖాన్ ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమా షూట్ కోసం విదేశాలకు వెళ్లిన ఆలియాభట్, కేన్స్ ఫెస్టివల్స్‌లో ఉన్న దీపిక.. ఈరోజు సాయంత్రానికి నగరానికి రానున్నారని కరణ్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొననున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, దక్షిణాది నుంచి విజయ్ దేవరకొండ, రష్మికలకు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Swara Bhaskar: నటి స్వర భాస్కర్‌ను చంపుతామంటూ బెదిరింపు లేఖ
-
Politics News
Revanth Reddy: మానవత్వం లేకుండా వెంకట్‌పై పోలీసులు దాడి చేశారు: రేవంత్‌రెడ్డి
-
World News
Boris Johnson: ‘పుతిన్ ఓ మహిళే అయితే’.. రష్యా అధ్యక్షుడిపై బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
Crime News
Prayagraj: కుమార్తె మృతదేహంతో ఐదు రోజులుగా ఇంట్లోనే.. బతికించేందుకు క్షుద్రపూజలు
-
General News
Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్