Vijay Devarakonda: ‘ఖుషి’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన విజయ్...
విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదలపై విజయ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. కొన్ని కారణాల వల్ల ‘ఖుషి’ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నట్లు తెలిపాడు.
హైదరాబాద్: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’(Kushi). ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత(Samantha) నటిస్తోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ మేరకు ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. అయితే తాజాగా విజయ్ ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఖుషి’ విడుదలపై క్లారిటీ ఇచ్చాడు.
‘‘ఖుషి సినిమా షూటింగ్ 60శాతం పూర్తి అయింది. మొదట మేము ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి(February 2023)లో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాం’’ అని చెప్పాడు. ఈ సందర్భంగా సమంత గురించి మాట్లాడుతూ ఆమెపై తనకున్న ఇష్టాన్ని మరోసారి తెలియజేశాడు. ‘‘ఖుషి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నేను డిగ్రి చదివేటప్పుడు సమంతని మొదటిసారి వెండితెరపై చూసి ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు ఆమెతో కలిసి నటిస్తున్నాను. సమంత గొప్ప నటి. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడం కోసం నేనేంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పాడు సెన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.