Updated : 29 Jul 2022 14:10 IST

Vijay Devarakonda: రష్మిక నా డార్లింగ్‌‌.. తనంటే నాకెంతో ఇష్టం: విజయ్‌ దేవరకొండ

అనన్యతో డేట్‌కి వెళ్లా కానీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy), ‘గీతగోవిందం’తో (Geetha Govindam) ఎంతోమంది అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda). ఆ రెండు సినిమాలతో ఆయనకు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. ఈ స్టార్‌ హృదయంలో ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్లందరి ప్రశ్నలకు ‘కాఫీ విత్‌ కరణ్‌’షోలో (Koffee With Karan) విజయ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నటి రష్మికతో (Rashmika) రిలేషన్‌ గురించి జరుగుతోన్న ప్రచారంపై మరోసారి స్పందించారు. రష్మిక తన డార్లింగ్‌ అని చెప్పుకొచ్చారు. ఆమె అంటే తనకెంతో ఇష్టమన్నారు.

‘‘విజయ్‌.. మీరు ప్రేమలో ఉన్నారా?’’ అన్న కరణ్‌ ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ.. ‘‘నేను పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు గట్టిగా సమాధానం చెబుతా. అప్పటివరకూ ఈ విషయంపై పెదవి విప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే, ఒక నటుడిగా ఇప్పుడు ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారు. వాళ్ల మనసులో నాకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఇంట్లో గోడలపై నా పోస్టర్లు, ఫోన్‌ వాల్‌పిక్‌పై నా ఫొటోలు పెట్టుకుని నన్ను ప్రేమిస్తున్నారు. ఇలాంటి సమయంలో నా ప్రేమ గురించి చెప్పి వాళ్ల మనోభావాలు దెబ్బతీయాలనుకోవడం లేదు’’ అని వివరించారు.

అనంతరం తాను రష్మికతో రిలేషన్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించారు. ‘‘నా కెరీర్‌ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. రష్మిక నాకు మంచి స్నేహితురాలు. తను నిజంగా డార్లింగ్‌. తనంటే నాకెంతో ఇష్టం. మేమిద్దరం కెరీర్‌, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్లం. దానివల్ల మా మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది’’ అని అన్నారు. ‘ఖుషి’(Kushi) కోస్టార్‌ సమంత (Samantha)పై విజయ్‌ పొగడ్తల వర్షం కురిపించారు. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే మహిళ ఎవరని అడగ్గా.. సమంత అని సమాధానమిచ్చారు. ఆమె అందమైన మహిళ అని, అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇక, అనన్యాపాండేతో తాను డేట్‌కు వెళ్లానని, కాకపోతే అది కేవలం ఫ్రెండ్లీ డేట్‌ మాత్రమేనని.. జాన్వీకపూర్‌ క్యూట్‌గా ఉంటుందని.. ఇప్పటికే పలుమార్లు ఆమెను బయట కలిశానని విజయ్‌ చెప్పుకొచ్చారు.

‘‘ఏదైనా ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌లా నగ్నంగా ఫొటోలు దిగాల్సి వస్తే.. మీరు ఒప్పుకొంటారా?’’ అని కరణ్‌ అడగ్గా.. ‘‘అలాంటి ఫొటోషూట్‌లో పాల్గొనడానికి నేను ఇబ్బందిపడను’’ అని విజయ్‌ స్పష్టం చేశారు.

ఎంతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌లో కరణ్‌ అడిగిన ప్రైవేటు ప్రశ్నలకు విజయ్‌ సమాధానం చెప్పలేకపోయారు. ‘‘మీరు చివరిసారిగా శృంగారం ఎప్పుడు చేశారు?’’, ‘‘పబ్లిక్‌ ప్రదేశాల్లో మీరెప్పుడైనా శృంగారం చేశారా?’’ అంటూ కరణ్‌ అడగ్గా.. ‘‘తాను ఓ సమయంలో ఓడలో శృంగారంలో పాల్గొన్నాను’’ అని విజయ్‌ చెప్పారు. అయితే ఈ ప్రశ్నలు కాస్త ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని