Vijay Deverakonda: విజయ్‌పై బెంగాలీ నటి వైరల్‌ కామెంట్‌..

గతంలో ఓ ప్రైవేటు ఆల్బమ్‌ కోసం విజయ్‌ దేవరకొండతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు నటి మాలోబిక. ఆమె చేసిన ఓ మ్యూజిక్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈనేపథ్యంలో ఆమె ఆంగ్ల పత్రికలకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో విజయ్‌ దేవరకొండ గురించి స్పందించారు.

Published : 28 Oct 2022 17:50 IST

ఇంటర్నెట్‌డెస్క్: నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)పై వైరల్‌ కామెంట్‌ చేశారు బెంగాలీ భామ మాలోబికా బెనర్జీ. గతంలో ఓ ప్రైవేటు ఆల్బమ్‌ కోసం విజయ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కోస్టార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కు హిందీ అర్థం కాదని.. ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేవాడని ఆమె అన్నారు.

‘‘ఓ ప్రైవేటు ఆల్బమ్‌ కోసం విజయ్‌ దేవరకొండతో కలిసి నేను స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నా. అతడు మంచి వ్యక్తి. పని పట్ల ఎంతో శ్రద్ధ చూపించేవాడు. అయితే, ఆ సాంగ్‌ షూట్‌ సమయంలో సెట్‌లో ఉన్న వారందరితో నేను హిందీలోనే మాట్లాడేదాన్ని. విజయ్‌తో కూడా హిందీలోనే మాట్లాడాను. కాకపోతే అతడు నా భాష విని ఎగతాళిగా నవ్వేవాడు. నేను మాట్లాడిందేది అర్థం కాలేదని, నా భాష కొత్తగా ఉందని అవహేళన చేసేవాడు. తెలుగులోనే మాట్లాడేవాడు. అలాంటిది ఇప్పుడు అతడు హిందీలో సినిమా చేశారు. ఇటీవల ‘లైగర్‌’ ట్రైలర్‌ చూశా’’ అని ఆమె నవ్వులు పూయించారు. విజయ్‌-మాలోబిక కలిసి నటించిన ‘నీ వెనకాలే నడిచి.. నీ వెలుగుల్లో మైమరిచి’ ఆల్బమ్‌ 2018లో విడుదలై యువతను ఎంతగానో ఆకట్టుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని