Vijay Deverakonda-Rashmika: విజయ్‌ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్‌: రష్మిక

‘గీత గోవిందాం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నటి రష్మిక (Rashmika). ట్విటర్‌ వేదికగా తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Published : 28 Sep 2023 15:44 IST

హైదరాబాద్‌: నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఉద్దేశిస్తూ నటి రష్మిక (Rashmika) ట్వీట్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ ఎప్పటికీ ది బెస్ట్‌ అని ఆమె అన్నారు. ఇంతకీ రష్మిక ఉన్నట్టుండి విజయ్‌ గురించి ట్వీట్‌ చేయడానికి గల కారణం ఏమిటంటే..?

రణ్‌బీర్‌ కపూర్‌ - రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్‌’ (Animal). సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రణ్‌బీర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం ఉదయం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దీనిని ఉద్దేశిస్తూ విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. టీజర్‌ తనకెంతో నచ్చిందన్నారు. ‘‘మై డార్లింగ్స్‌ సందీప్‌ రెడ్డి వంగా, రష్మిక.. అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అని రాసుకొచ్చారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. ‘‘థ్యాంక్యూ విజయ్‌ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్‌’’ అని రిప్లై ఇచ్చారు.

skanda movie review: రివ్యూ స్కంద.. రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?

మరోవైపు, నిర్మాత నాగవంశీ సైతం ‘యానిమల్‌’ టీమ్‌ను మెచ్చుకున్నారు. ‘‘వైలెంట్లీ ఎక్స్‌ప్లోజివ్‌!! సందీప్‌.. వైలెన్స్‌ అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తానంటూ గతంలో నువ్వు చెప్పినట్టుగానే ఈ టీజర్‌తో పరిచయం చేశావు. రణ్‌బీర్‌ కళ్లల్లోని ఆ తీవ్రత చూస్తుంటే డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు బద్దలయ్యేలా ఉన్నాయి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. నెటిజన్లు సైతం ‘యానిమల్‌’ టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీజర్‌ మరోస్థాయిలో ఉందని.. హిట్‌ ఖాయం అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని