Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండతో నిహారిక ఫైట్‌‌.. ఎందుకంటే..!

నటుడు విజయ్‌ దేవరకొండతో(Vijay Deverakonda) సోషల్‌ మీడియా సెలబ్రిటీ నిహారిక (Niharika) పోరాటానికి దిగారు. కరాటే, కిక్‌ బాక్సింగ్‌ చేస్తూ ఆయనతో...

Updated : 08 Dec 2022 17:46 IST

హైదరాబాద్‌: నటుడు విజయ్‌ దేవరకొండతో(Vijay Deverakonda) సోషల్‌ మీడియా సెలబ్రిటీ నిహారిక (Niharika) పోరాటానికి దిగారు. కరాటే, కిక్‌ బాక్సింగ్‌ చేస్తూ ఆయనతో తలపడ్డారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా విజయ్‌ ఆమెపై పంచ్‌లు విసురుతున్నారు. ‘రా.. చూసుకుందాం’ అంటూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఇంతటి పోరు జరగడానికి కారణమేమిటంటే..

ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లనే కాకుండా సెలబ్రిటీల దృష్టినీ ఆకట్టుకుంటున్నారు నిహారిక. ‘కేజీయఫ్‌’, ‘సర్కారు వారి పాట’, ‘రన్‌ వే 34’, ‘జెర్సీ’ (హిందీ వెర్షన్‌), ‘మేజర్‌’.. ఇలా ఇటీవల విడుదలైన పలు క్రేజీ ప్రాజెక్టులకు ఆయా చిత్రాల హీరోలతో కలిసి ఆమె ప్రమోషనల్‌ వీడియోలు చేశారు. కాగా, తాజాగా ఆమె ‘లైగర్‌’ (Liger) కోసం రంగంలోకి దిగారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విజయ్‌తో కలిసి ఆమె ఓ స్పెషల్ వీడియో చేశారు. వీడియో ఆరంభంలో విజయ్‌తో ఫైట్‌ చేస్తున్నట్లు కనిపించిన ఆమె అనంతరం ఆయన కటౌట్‌కు ఫిదా అయినట్లు ఎంతో సరదాగా చూపించారు. అలాగే.. విజయ్‌ని ఇమిటేట్‌ చేస్తూ నత్తి ఉన్నట్లు ఆమె మాట్లాడటం నవ్వులు పూయించేలా ఉంది. ప్రస్తుతం ఈవీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక, ఇలియానా, సుస్మితా కొణిదెల, సోనాల్‌ దేవ్‌రాజ్‌, నిఖిల్‌ తనీజా.. తదితరులు దీనిపై స్పందిస్తూ.. వీడియో ఫుల్‌ ఫన్నీగా ఉందని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు