Vijay Deverakonda: సామ్‌ని ఆరాధిస్తున్నా అంటూ విజయ్ ట్వీట్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇది
‘మహానటి’ కోసం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు నటి సమంత, నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ఓ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోస్టార్ సమంతపై తన ఇష్టాన్ని తెలియజేశారు విజయ్.
హైదరాబాద్: సమంతపై (Samantha) తన ఇష్టాన్ని బయటపెట్టారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఎంతో కాలం నుంచి ఆమెను అభిమానిస్తున్నట్లు పేర్కొన్నాడు. సామ్ ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ (Yashoda) ట్రైలర్ విడుదల చేసిన విజయ్ దేవరకొండ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడిపోయాను. ఇక, ఇప్పుడైతే అన్ని విధాలుగా ఆమెను ఆరాధిస్తున్నా’’ అని అన్నాడు.
ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ ప్రియులు.. ‘మీ ఇద్దరి జోడీని మరోసారి స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నాం’, ‘ఖుషి అప్‌డేట్‌లు ఇవ్వండి అన్నా’, ‘ఆన్‌స్క్రీన్‌లో మీ పెయిర్ బాగుంటుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ‘మహానటి’ తర్వాత విజయ్ దేవరకొండ - సమంత కాంబోలో సిద్ధమవుతోన్న లవ్ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ టైటిల్ పోస్టర్, మేకింగ్ వీడియోలు సామ్-విజయ్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
‘యశోద’ (Yashoda) విషయానికి వస్తే.. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సరోగసీ పేరుతో అన్యాయాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులపై సామ్ చేసే పోరాటాలను చూపిస్తూ తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. హరి - హరీశ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.