Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్‌ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!

విజయ్‌ దేవరకొండ గతంలో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్‌ పేరిట ఇంతకాలం చేసిన ఆ వ్యాపారానికి ఆయన ముగింపు పలకనున్నారు.

Published : 23 Sep 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ చెబుతూనే ఓ గుడ్‌ న్యూస్‌ వినిపించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. రౌడీ బ్రాండ్‌  (#Rowdy) పేరుతో ఆయన 2018లో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడా బ్రాండ్‌కు ముగింపు పలకనున్నారు. ఈసారి అంతకుమించి అనిపించేలా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టనున్నారు. దీపావళి సందర్భంగా ఆ సర్‌ప్రైజ్‌ని ప్రకటించనున్నట్లు విజయ్‌ తెలిపారు. రౌడీవేర్‌కు సంబంధించి గతంలో జరిగిన వేడుకల దృశ్యాలను వీడియోలో చూపించారు. ఆ విజువల్స్‌ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విజయ్‌ ఈసారి ఎలాంటి బిజినెస్‌ చేస్తారోనని ఆసక్తి నెలకొంది. అయితే, ఆ విషయంపై కొన్ని రోజుల క్రితమే హింట్‌ ఇచ్చారు. ఓ అమ్మాయి చేతిలో ఓ అబ్బాయి చేయి ఉన్న దృశ్యాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. అందులో ఓ చేతికి ఉన్న వాచ్‌ హైలైట్‌ అయింది. బిజినెస్‌ ప్రమోషన్‌ అని కొందరు ఊహించగా.. కొందరు పెళ్లి కబురు చెప్పబోతున్నారని అభిప్రాయపడ్డారు.

మంచు మనోజ్‌ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?

సినిమాల విషయానికొస్తే.. తాజాగా ‘ఖుషి’ (Kushi)తో విజయం అందుకున్న విజయ్‌.. వంద కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత కథానాయికగా రూపొందిన ఈ చిత్రం తనకు చాలా దగ్గరైందని ఆయన ఓ సందర్భంలో పేర్కొన్నారు. ప్రస్తుతం.. పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా (మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక), గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని