Published : 27 May 2022 02:01 IST

Vijay Deverakonda: ఆమిర్‌ఖాన్‌తో విజయ్‌ దేవరకొండ.. అందుకే కలిశారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకేచోట కనిపిస్తే చాలు సినీ అభిమానులు ఖుషీ అవుతారు. వీళ్లెందుకు కలిశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఆమిర్‌ఖాన్‌- విజయ్‌ దేవరకొండ కలిసి దిగిన ఫొటో ఇలాంటి ఆసక్తినే పెంచుతోంది. నెట్టింట వేల సంఖ్యలో లైక్స్‌ పొంది వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు ఇలా కలిసేందుకు కారణం బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌. ఈయన తన పుట్టినరోజు సందర్భంగా హిందీ తారలతోపాటు టాలీవుడ్‌ నుంచి విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మిను ఆహ్వానించారు. ఈ సెలబ్రేషన్స్‌లో చోటు చేసుకున్న దృశ్యమే ఇది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఒక్కో ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా ఛార్మి షేర్‌ చేస్తోంది. ప్రస్తుతానికి ఆమిర్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రవీనా టాండన్‌, సోనాలి బింద్రేతో దిగిన స్టిల్‌ను పోస్ట్‌ చేసింది. సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌- ఐశ్వర్యరాయ్, మలైకా అరోరా, కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌, సైఫ్‌ అలీఖాన్‌- కరీనాకపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌, హృతిక్‌రోషన్‌, అనన్య పాండే, సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌, టైగర్ ష్రాఫ్‌ తదితరులు కరణ్‌ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందుతున్న ‘లైగర్‌’ చిత్రానికి కరణ్‌ జోహార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని